సంతనూతలపాడు: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన చీమకుర్తికి చెందిన యువ క్రీడాకారుడు యశ్వంత్
చీమకుర్తికి చెందిన క్రీడాకారుడు గోపవరపు యశ్వంత్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్టు కోచ్ కురిచెటి వెంకట్ బుధవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో అమరావతిలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర హాకీ పోటీల్లో గోపవరపు యశ్వంత్ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ ను పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు అభినందించారు