ఖానాపూర్: ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ భవేశ్ మిశ్రా
ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని, పారిశుద్ధ్యాన్ని కాపాడాలని అధికారులకు సూచించారు. రోగులతో మర్యాదగా వ్యవహరించి, రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.