లక్సెట్టిపేట: వృద్ధాప్యంలో తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణపై న్యాయ సదస్సు
లక్షెట్టిపేటలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. తల్లిదండ్రులను గౌరవించాలని, వయోవృద్ధుల హక్కులు మరియు చట్టపరమైన రక్షణల గురించి అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి డి. రామమోహన్ రెడ్డి మరియు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ వివరించారు.