ఆళ్లగడ్డ: అప్పనపల్లి సమీపంలో రెండు బైకులు ఢీ ముగ్గురికి తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం అప్పనపల్లి సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి, రుద్రవరానికి చెందిన ఉగ్ర నరసింహం, అప్పనపల్లి కి చెందిన బాల హుస్సేన్, విజయ్ కుమార్ లు తీవ్రంగా గాయపడ్డారు, వెంటనే స్థానికులు 108 వాహనంలో వీరిని రుద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం ప్రధమ చికిత్స పూర్తి చేసి మెరుగైన వైద్యం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు