కనిగిరి: తన కుమారుడిది హత్యే, న్యాయం చేయాలంటూ సింగరాయకొండ నవోదయ కోచింగ్ సెంటర్ వద్ద కనిగిరికి చెందిన తల్లి మౌలాబి నిరసన
కనిగిరి: సింగరాయకొండ పరిధిలోని మూలగుంటపాడు వద్ద గల శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ హాస్టల్లో గతంలో కనిగిరి కి చెందిన విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఉదంతం మళ్లీ తెరపైకి వచ్చింది. విద్యార్థి తౌషిక్ కోచింగ్ సెంటర్ లో ఆత్మహత్య చేసుకున్నాడని యాజమాన్యం చెబుతున్నపట్టికీ,ఈ కేసులో అనుమానాలు ఉన్నాయని విద్యార్థి తౌషిక్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తనకుమారుడిది ముమ్మాటికీ హత్యేనంటూ ఆదివారం కోచింగ్ సెంటర్ వద్ద తౌషిక్ తల్లి మౌలాబి మరోసారి నిరసనకు దిగారు. తమ బిడ్డ మృతికి గల అసలు కారణాలను బయటకు తీసి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.