ఒంగోలు అర్బన్: ఒంగోలులో ఆకట్టుకున్న లేజర్ షో, 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ
Ongole Urban, Prakasam | Sep 30, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర 150 వేడుకల్లో యువత లేజర్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అద్భుతమైన లేజర్ లైట్లతో యువత నిర్వహించిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. రంగురంగుల లేజర్ కాంతుల మధ్య యువత డాన్స్ను ప్రేక్షకులు ఉత్సాహంగా వీక్షిస్తూ కేరింతలు కొట్టారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పలు కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.