ఒంగోలు అర్బన్: రూట్ సెట్ సంస్థలో సంస్థలో శిక్షణ పొంది విజయవంతమైన వారిని సన్మానించి అభినందించిన సంస్థ ప్రతినిధులు
Ongole Urban, Prakasam | Aug 15, 2026
రూట్ సెట్ సంస్థలో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా సంస్థలో శిక్షణ పొంది విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థిక పురోగతి చెందుతున్న శిక్షణార్థులకు సన్మాన కార్యక్రమం జరిగింది. వారిలో పి వెంకటేష్, సెల్ఫోన్ రిపేర్ షాపు, రేఖ,టైలరింగ్ మరియు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, శ్రీనివాస్ రెడ్డి, సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్, కుమారి హరిత, బ్యూటీ పార్లర్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వీరందరూ ప్రస్తుతం సంస్థలో జరుగుతున్న టైలరింగ్ శిక్షణార్ధులతో మాట్లాడి తమ వ్యాపార విజయాలకు గల కారణాలను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో రమేష్ , లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు