సంతనూతలపాడు: ఏపీ జూనియర్ మహిళల హాకీ జట్టు మేనేజర్ గా నియమితులైన మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పీఈటి రవికుమార్
సంతనూతలపాడు మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న తిరుమలశెట్టి రవికుమార్ ఆంధ్రప్రదేశ్ జూనియర్ మహిళల హాకీ జట్టు మేనేజర్ గా నియమితులయ్యారు.ఈ మేరకు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించే 16వ హాకీ ఇండియా జూనియర్ మహిళల హాకీ జట్టు తరఫున ఏపీ మేనేజర్ గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా రవికుమార్ ను సంతనూతలపాడు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు గురువారం అభినందించారు.