ఆలేరు: ఆలేరులో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మీడియా ప్రతినిధులు
Alair, Yadadri | Oct 2, 2026 ఆలేరులో జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుతూ టియూడబ్ల్యూజె ఐజేయు నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం మీడియా సంస్థల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు.