నారాయణపేట్: నారాయణపేటలో సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్ ప్రకటన
నారాయణపేట కలెక్టరేట్లో సెప్టెంబర్ 28, సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ప్రకటించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి వనపర్తి పర్యటన దృష్ట్యా అధికారులు వెళ్లాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.