శ్రీశైలం: ఆత్మకూరు మండలంలోని NH 340c రహదారి పై పలుచోట్ల అండర్ పాస్ లు నిర్మించాలని కేంద్రమంత్రి కి వినతిపత్రం అందజేసిన MP శబరి
కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని వారి కార్యాలయంలో బైరెడ్డి శభరి మర్యాదపూర్వకంగా కలిసి, నంద్యాల జిల్లా ప్రజల భద్రత, సౌకర్యం, మెరుగైన రవాణా కనెక్టివిటీకి సంబంధించిన పలు ముఖ్యమైన అభ్యర్థనలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు బొల్లవరం, కరివేన, ఆత్మకూరు–సిద్ధాపల్లె జంక్షన్ వద్ద అండర్‌పాస్‌లు, పారుమంచాల వద్ద మీడియన్ ఓపెనింగ్, డీపాల్ స్కూల్ సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, భానుముక్కల–ఇస్కాల గ్రామాల్లో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరాను. అలాగే ఎన్‌హెచ్-340సీ ఆత్మకూరు–దోర్నాల, రహదారులకు సంబంధించిన డీపీఆర్‌ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.