ఎలమంచిలి: మునగపాక: పట్టపగలే ఇంట్లో భారీ చోరీ.. ముప్పావు తులం బంగారం, వెండి అపహరణ
మునగపాక ఇందిరమ్మ కాలనీలో ఆటో డ్రైవర్ పట్నాల నానిబాబు ఇంట్లో చోరీ జరిగింది. పగటిపూట ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు ముప్పావు తులం బంగారం, 30 తులాల వెండి పట్టీలను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.