నిర్మల్: సోన్ మండలంలో జోనల్ స్థాయి యోగ సెలెక్షన్ పోటీలు ప్రారంభం
Nirmal, Nirmal | Oct 4, 2026 సోన్ మండల కేంద్రంలో ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం యోగ సెలెక్షన్ పోటీలు మొదలయ్యాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అండర్-14, 17 విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని తదుపరి స్థాయికి ఎంపిక చేయనున్నారు.