పూతలపట్టు: చిత్తూరులో భారీ వర్షం: జలమయమైన రోడ్లు, స్తంభించిన జనజీవనం
చిత్తూరు నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగి, జనజీవనం స్తంభించింది.