డోన్: రౌడీ షీటర్లు ప్రతివారం స్టేషన్కు రావాలి: సీఐ ఇంతియాజ్ భాష
Dhone, Nandyal | Aug 16, 2026 డోన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు సీఐ ఇంతియాజ్ బాషా ఆధ్వర్యంలో ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో జీవిస్తూ నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల సూచనలను ఉల్లంఘిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వారం తప్పనిసరిగా స్టేషన్కు హాజరు కావాలని ఆదేశించారు.