ఒంగోలు అర్బన్: చీమకుర్తి మండలంలోని మెడ్ వెస్ట్ గ్రానైట్ క్వారీలో ప్రమాదం, కూలీలందరూ క్షేమంగా ఉన్నారని డిఎస్పి శ్రీనివాసరావు వెల్లడి
Ongole Urban, Prakasam | Oct 2, 2026
ప్రకాశం: చీమకుర్తి మండలంలోని మెడ్ వెస్ట్ గ్రానైట్ క్వారీలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని డిఎస్పి శ్రీనివాసరావు వెల్లడించారు. గురువారం సాయంత్రం క్వారీలో బండరాలు భారీగా కిందపడ్డాయి. ఆ సమయంలో కూలీలు ఎవరైనా ఉండి ఉండవచ్చని మొదట అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. తర్వాత డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదని తేల్చి చెప్పారు. తర్వాత డిఎస్పీ మీడియాతో మాట్లాడారు. కూలీలందరూ క్షేమంగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.