కనిగిరి: త్యాగధనుల పోరాట స్ఫూర్తితో దేశ ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన త్యాగదనుల పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ ప్రగతి కోసం పనిచేయాలని కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలన్నారు, దేశ సమగ్రత కోసం, అభ్యున్నతి కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కనిగిరి పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్, టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.