డోన్: బేతంచర్ల మండలంలో తండ్రిని చంపిన కుమారుడు
Dhone, Nandyal | Aug 16, 2026 బేతంచెర్ల మండలం రంగాపురంలో హత్య జరిగింది. గ్రామానికి చెందిన ఆకుల శివకుమార్ (49) తరచూ మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. ఈక్రమంలో శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన శివకుమార్ భార్య, కుమారుడు శరత్కుమార్తో గొడవకు దిగాడు. దీంతో కుమారుడు తండ్రిపై కట్టెతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.