మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్ నగర్: స్వామి వివేకానంద కళాశాలలో 11 మందికి ఉద్యోగాలు
మహబూబ్ నగర్ స్వామి వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ లో 11 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పాలమూరు బయో రీసర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 45 మంది అభ్యర్థులు పాల్గొనగా, ప్రతిభ కనబరిచిన వారికి నియామక పత్రాలను అందజేశారు.