నంద్యాల అర్బన్: మహానంది మండలంలో రెండు తలల పాము కలకలం
Nandyal Urban, Nandyal | Aug 16, 2026
మహానంది మండలం అల్లినగరంలోని షేక్ రేష్మ ఇంట్లో రెండు తలల పూడు పాము కనిపించింది. రెండు తలల పామును చూసి భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు అయ్యన్న నగర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ మోహన్కు సమాచారం అందించారు. మోహన్ వెంటనే గ్రామానికి చేరుకొని ఇంట్లో ఉన్న పామును పట్టుకొని సురక్షితంగా సమీపంలోని నల్లమల అడవిలో వదిలేశాడు. రెండు తలల పామును చూసేందుకు బార్లు తీరాలు