రాజమండ్రి సిటీ: తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు
తూర్పుగోదావరి జిల్లాలో పదవీ విరమణ పొందిన ముగ్గురు ఎస్సైలను జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఘనంగా సన్మానించారు. పోలీస్ శాఖకు వీరు అందించిన సేవలను అభినందిస్తూ, వారి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.