అమలాపురం: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కీలక సూచనలు
అమలాపురంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ఎస్పీ రాహుల్ మీనా సమావేశమయ్యారు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించాలని, వదంతులను ప్రచారం చేయవద్దని ఇన్ఫ్లుయెన్సర్లను కోరారు. ప్రజా భద్రతలో భాగస్వాములు కావాలని సూచించారు.