మహబూబ్ నగర్ రూరల్: మహబూబ్ నగర్ లో ఫార్మసిస్టుల ర్యాలీ: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
ఫార్మసిస్ట్ డే సందర్భంగా మహబూబ్ నగర్ లో జిల్లా ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఫార్మసిస్టుల సమస్యలను పరిష్కరించాలని, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.