మండపేట: కృష్ణుడి అవతారంలో కపిలేశ్వరపురం గణపయ్య.. వైభవంగా శోభాయాత్ర!
తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం అగ్రహారంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. శెట్టిబలిజ కాలనీలో శ్రీకృష్ణుడి గెటప్‌లో అలంకరించిన వినాయక విగ్రహ శోభాయాత్ర భక్తులను అలరించింది. మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలతో గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.