మహబూబ్ నగర్ రూరల్: రాష్ట్ర స్థాయి హైజంప్ పోటీల్లో వెల్దండ విద్యార్థిని శ్రీవల్లికి ప్రథమ స్థానం
వరంగల్ లో జరిగిన 12వ అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో వెల్దండ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని శ్రీవల్లి హైజంప్ లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. మరో ముగ్గురు విద్యార్థినులు కూడా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.