గిద్దలూరు: బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామంలో ఆర్మీ ఉద్యోగి కిషన్ మృతి, నేడు అధికారుల అంచనాలతో అంత్యక్రియలు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి కిషన్ అంత్యక్రియలు నేడు బుధవారం నిర్వహిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కిషన్ మృతి చెందాడు. అధికారులు స్వగ్రామానికి తరలించి అధికారలాంచనాలతో నేడు అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎస్పి, కలెక్టర్ హాజరై కిషన్ కి నివాళులు అర్పిస్తారు.