మచిలీపట్నం: బందరు అభివృద్ధిని అడ్డుకుంటున్న పేర్ని నాని: మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు విమర్శలు
బందరులో రానున్న 8 వేల కోట్ల గోవా షిప్ యార్డ్ ప్రాజెక్టును మాజీ మంత్రి పేర్ని నాని అడ్డుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రభుత్వం రైతులకు మంచి ధర ఇచ్చి భూములు సేకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.