నిర్మల్: ఆదిలాబాద్‌లో 9న బహుజన రాజ్యాధికార సంకల్ప సభ: నిర్మల్ జిల్లా బీఎస్పీ పిలుపు
Nirmal, Nirmal | Oct 4, 2026 ఆదిలాబాద్‌లోని రెవెన్యూ గార్డెన్లో ఈ నెల 9న కాన్షీరాం వర్ధంతి సందర్భంగా బహుజన రాజ్యాధికార సంకల్ప సభను నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్ మోహన్ కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.