ఒంగోలు అర్బన్: పేస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో 700 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీని నిర్వహించడం గొప్ప విషయం :జిల్లా కలెక్టర్ రా
Ongole Urban, Prakasam | Aug 14, 2026
పేస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో 700 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీని నిర్వహించడం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ రాజా బాబు కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జండా ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ ప్రజలందరూ దేశభక్తిని చాటి చెప్పాలని ఆయన అన్నారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల్లో దేశభక్తి గురించి దాని యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి కాలేజీలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తద్వారా యువతలో దేశభక్తి పెంచడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డాడు