కురవి: బీజేపీ విధానాలు మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్నాయి: సీపీఐ నేత నల్లు సుధాకర్ రెడ్డి
కురవిలో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి. బీజేపీ ప్రభుత్వం మెజారిటీ వాద రాజకీయాలతో మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆయన విమర్శించారు. గాంధేయవాదులంతా ఏకమై దేశ సంస్కృతిని కాపాడాలని పిలుపునిచ్చారు.