నిజామాబాద్ సౌత్: నిజామాబాద్: ప్లాస్టిక్ ఇస్తే చక్కెర ఉచితం - దేవన్నగర్లో వినూత్న కార్యక్రమం
నిజామాబాద్ జిల్లా దేవన్నగర్లో ప్లాస్టిక్ నియంత్రణ కోసం వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. కిలో ప్లాస్టిక్ ఇస్తే కిలో చక్కెర ఉచితంగా ఇచ్చే పథకాన్ని సర్పంచ్ యూసుఫ్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. పశువుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.