సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో 350 మీటర్ల భారీ జాతీయ జెండాతో విద్యార్థుల హర్ ఘర్ తిరంగా ర్యాలీ
చీమకుర్తి పట్టణంలో విద్యార్థులు గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎస్సై సంపత్ , మరియు ఉపాధ్యాయులు ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు 350 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం పట్టణ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఎస్సై సంపత్ మాట్లాడుతూ... విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. దేశ సమగ్రత కోసం విద్యార్థులు పాటుపడాలని పిలుపునిచ్చారు.