సంతనూతలపాడు: చీమకుర్తి లోని తాళ్లూరు రహదారిలో రోడ్డు ప్రమాదం, వ్యక్తి అక్కడికక్కడే మృతి
చీమకుర్తి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చీమకుర్తిలోని తాళ్లూరు వెళ్లే రహదారిలో శనివారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీమకుర్తి లోని తాళ్లూరుకు వెళ్ళు రహదారిలో మోటార్ బైక్ పై వెళ్తున్న వ్యక్తి రహదారి పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఎవరనేది పోలీసుల విచారణలో తేలవలసి ఉంది.