మునగాల: సబ్‌స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు, జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
మునగాలలో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 33 కేవీ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనతో జాతీయ రహదారి 65పై ట్రాఫిక్ స్తంభించింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు.