అనకాపల్లి: అనకాపల్లిలో మహిళల భద్రత కోసం 'అభయ' QR కోడ్ సేవలు ప్రారంభం
అనకాపల్లి జిల్లాలో మహిళల రక్షణకు పోలీసులు 'అభయ' కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజా రవాణా వాహనాల్లో ఏర్పాటు చేసిన QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మహిళలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. తక్షణ సహాయం కోసం 112, సైబర్ నేరాలకు 1930 నంబర్లను సంప్రదించాలని ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు.