విశాఖపట్నం: అంతర్జాతీయ కాఫీ దినోత్సవం: అరకు కాఫీకి ప్రపంచస్థాయి గుర్తింపు లక్ష్యం
అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా విశాఖలోని అరకు వ్యాలీ కాఫీ కేఫ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కాఫీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. రైతులకు మెరుగైన ఆదాయం కల్పించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.