ఏటూరునాగారం: తుడుం దెబ్బ ములుగు జిల్లా, మండల కమిటీల రద్దు: అక్టోబర్ 14న ధర్నాకు పిలుపు
తుడుం దెబ్బ ములుగు జిల్లా మరియు మండల కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఆ సంఘం ప్రకటించింది. అక్టోబర్ 14న ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని కోరుతూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు జాతీయ అధ్యక్షులు వట్టం ఉపేందర్ వెల్లడించారు. ఆ తర్వాతే కొత్త కమిటీల ఎన్నికలు ఉంటాయని తెలిపారు.