బాలానగర్: బాలనగర్ లో డీసీఎంను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. బోల్తా పడిన వాహనం
బాలనగర్ మండల కేంద్రంలో ఉల్లిగడ్డ లోడుతో వెళ్తున్న డీసీఎంను ప్రైవేటు ఓల్వా బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో డీసీఎం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.