కుప్పం: రామకుప్పంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల చర్యలు: నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
రామకుప్పం మండల కేంద్రంలోని ప్రధాన బజారులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఎస్ఐ మారెప్ప ఆధ్వర్యంలో పోలీసులు గస్తీ నిర్వహించారు. రోడ్డుపై ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయవద్దని, క్రమపద్ధతిలో వాహనాలు నిలపాలని వాహనదారులను హెచ్చరించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.