సంగారెడ్డి: సంగారెడ్డిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ ఆశయాలను నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.