యర్రగొండపాలెం: దోర్నాల మండలం నల్లమల్ల అడవి ప్రాంతంలో ప్రారంభమైన జంగిల్ సఫారీ
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని తుమ్మలబైలు ఇష్టకామేశ్వరి అమ్మవారి జంగిల్ సఫారీ యాత్రను అటవీశాఖ అధికారులు గురువారం నుండి ప్రారంభించారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆదేశాల మేరకు పులుల సంతానోత్పత్తి కాలం దృష్ట్యా గడిచిన మూడు నెలల పాటు యాత్రను అధికారులను నిలిపివేశారు. తిరిగి పరాటకులను జంగల్ సఫారీ అనుమతించనున్నారు.