యర్రగొండపాలెం: దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో బారిగా ట్రాఫిక్ కు అంతరాయం
మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరుసగా సెలవులు కావడంతో శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తుండడంతో వాహనాల రద్దీ ఏర్పడింది. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో ప్రయాణికులు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.