మోత్కూర్: పాలడుగు గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు మరియు గ్రామ సభ
అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా పాలడుగు గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ అంతటి భగవంతు మరియు సెక్రటరీ గారు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.