నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలులో కెవిపిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం: ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిక
నాగర్ కర్నూలులో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) 29వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేస్తామని, సంక్షేమ హాస్టళ్లకు నిధులు కేటాయించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న డిమాండ్ చేశారు.