మెదక్: మెదక్ జిల్లాలో భర్త హత్య కేసు: భార్య, మామకు జీవిత ఖైదు
Medak, Medak | Sep 28, 2026 మెదక్ జిల్లా హవేలి ఘనపూర్‌లో దొడ్ల వెంకటేష్‌ను చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో నిందితులైన భార్య విజయ, మామ నర్సింలుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. వీరికి చెరో రూ. 5 వేల జరిమానా కూడా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పు చెప్పారు.