శ్రీశైలం: ఆత్మకూరు సున్నిపెంట పరిసరాల్లో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు, మద్యం బాటిల్లు స్వాదినం, ఇద్దరిపై కేసు నమోదు
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్,ఆదేశాల మేరకు, ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్ సూచనలతో ఆత్మకూరు సబ్‌డివిజన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం, వెంకటాపురం, పెద్దనంతాపురం గ్రామాల్లో నిర్వహించిన తనిఖీల్లో 180 ఎంఎల్ పరిమాణం కలిగిన 15 క్వార్టర్ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒకరిపై కేసు నమోదు చేశారు. శ్రీశైలం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందిపెంట గ్రామంలోని లంబాడీ కాలనీలో నిర్వహించిన కార్డెన్ అండ్ సెర్చ్‌లో 10 లీటర్ల అక్రమ సారాను స్వాధీనం చేసుకుని, ఒకరిపై కేసు నమోదు చేశారు.