మందమర్రి: మందమరి పోలీస్ స్టేషన్లో సిపి అంబర్ కిశోర్ ఝా తనిఖీలు: కీలక ఆదేశాలు
మంచిర్యాల జిల్లా మందమరి పోలీస్ స్టేషన్ను రామగుండం సిపి అంబర్ కిశోర్ ఝా తనిఖీ చేశారు. సింగరేణి ప్రాంతంలో దొంగతనాల నియంత్రణపై, అలాగే మందమరిని నేర, మాదకద్రవ్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.