ఒంగోలు అర్బన్: ఒంగోలులో జరిగిన బాలికల ఘటనపై విచారణ జరపాలని బిసి వెల్ఫేర్ అధికారికి విన్నతి పత్రం సమర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
Ongole Urban, Prakasam | Sep 30, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుమల్లి బీసీ సంక్షేమ హాస్టల్లో ఉంటున్న ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార.యత్నం ఘటనపై విచారణ జరపాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీసీ వెల్ఫేర్ అధికారి జ్యోతిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అలానే జరుగుమల్లిలోని బీసీ సంక్షేమ హాస్టల్ ని సందర్శించి విద్యార్థులతో ఎమ్మార్పీఎస్ నాయకులు రావినూతల మాట్లాడారు. బాగా చదువుకోవాలని ఇటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉంటూ దూరంగా ఉండాలని విద్యార్థులకు అయిన సూచించారు.