కనిగిరి: పామూరులో వ్యక్తిపై రోకలి బండతో దాడి, తీవ్ర గాయాలు
పామూరు: ఓ వ్యక్తిపై రోకలితో దాడి చేసిన ఘటన పామూరులో మంగళవారం రాత్రి జరగగా ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే.. గంధం యాకోబుకి వెంకటేశ్ అనే వ్యక్తి నగదు బాకీ ఉన్నాడు. అయితే బాకీ వసూలు కోసం అతను ఇంటి వద్దకు వెళ్లి అడుగే క్రమంలో గొడవ జరిగింది. అది కాస్తా ఘర్షనకు దారితీయగా.. పక్కనే ఉన్న వెంకటేశ్ బందువు శీను యాకోబుపై రోకలి బండతో కొట్టగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే యాకోబు ను ఆసుపత్రికి తరలించారు.