చిత్తూరు: మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి రూ.40 వేల జరిమానా
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ చిత్తూరులో పట్టుబడిన నలుగురికి కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. మొత్తం రూ.40 వేల జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.